Kesineni Nani: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళ్లారు. వైసీపీలో చేరేందుకు కేశినేని నాని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేశినేని నానితో ఇప్పటికే అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి, దేవినేని అవినాశ్, మొండి తోక అరుణ్ చర్చలు జరిపారు. ఆ తర్వాతే వారంతా ఒకే కార్‌లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.
టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించారు. టీడీపీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని అన్నారు. తిరువూరులో జరిగిన గొడవ తర్వాత కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ తనకు ఇవ్వట్లేదని ముగ్గురు టీడీపీ నాయకులు తనకు చెప్పారని కేశినేని నాని అంటున్నారు. కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Also Read: విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?