Kodali Nani : సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదు, కిరాణ కొట్లే పెట్టుకోండి-కొడాలి నాని

ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గించలేదని, అవి గతంలో ఉన్న రేట్లే అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సినిమా థియేటర్ కంటే కిరాణ కొట్టుకు ఆదాయం ఎక్కువ వస్తే.. సినిమాలు ఎందుకు..

Kodali Nani

Kodali Nani : ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు సినిమాలు వేయలేము అని, నిర్వహణ కష్టం అవుతుందని చెబుతూ అనేకమంది స్వచ్చందంగా థియేటర్లు మూసేయడయం మరింత హీట్ పెంచింది. ఈ వ్యవహారంపై రచ్చ నడుస్తోంది.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుపట్టారు. బహిరంగంగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అటు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సీఎం జగన్ సినీ పరిశ్రమపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాలతో సిని పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని వాపోయారు.

తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గించలేదని, అవి గతంలో ఉన్న రేట్లే అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రతీ సినిమాకి కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకుని ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకునే వారని, ఆ పరిస్థితి రాకుండా చెయ్యడానికే జీవో 35 తెచ్చామని వివరణ ఇచ్చారు. సినిమా థియేటర్ కంటే కిరాణ కొట్టుకు ఆదాయం ఎక్కువ వస్తే.. సినిమాలు ఎందుకు.. కొట్టులే పెట్టుకుంటారు కదా అని హీరో నానిని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని పరోక్షంగా విమర్శలు చేశారు. సీఎం జగన్ పై ద్వేషం ఉన్నవాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు.

SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకున్నారా?

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎగ్జిబిటర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి తేల్చి చెప్పారు. థియేటర్లలో లక్ష సీట్లుంటే అందులో రూ.10 సీట్లు వెయ్యి కూడా ఉండవన్నారు. బడ్డీ కొట్టు ఆదాయం కూడా థియేటర్‌కు రాదన్నది జోక్ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

”సినిమా థియేటర్ కంటే కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా? సినిమా టికెట్ల రేట్లు ప్రభుత్వం ఎక్కడా తగ్గించలేదు. గతంలో కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునే వారు.. మా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని జీవో ఇచ్చింది. కానీ, మేం రేట్లు ఎక్కడా తగ్గించలేదు. సినీ పరిశ్రమలోని కొందరు కోర్టు అనుమతితో అడ్డంగా దోచుకునే అవకాశం లేకుండా మా ప్రభుత్వం చేసింది. సినిమా టికెట్ రేట్ తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టం అని చెబుతున్నారు, ఎగ్జిబిటర్‌ను అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ల విషయంలో కొంతమంది గేమ్ ఆడుతున్నారు” అని కొడాలి నాని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ రేట్లతో థియేటర్ల నిర్వహణ కష్టమని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు థియేటర్లలో సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఓవైపు టికెట్ రేట్ల తగ్గింపు, మరోవైపు సోదాలు.. ఈ పరిస్థితుల్లో సినిమా హాళ్లను నడపలేము అంటూ స్వచ్చందంగా మూసివేస్తున్నారు వాటి యజమానులు.

ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత.. మూవీ లవర్స్ కు తీవ్ర నిరాశ మిగులుస్తోంది. గత వారంలో ఏకంగా 175 థియేటర్లు మూతపడడం.. పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ గందరగోళానికి త్వరగా ఎండ్ కార్డ్ పడాలని మూవీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.