Kodali Nani On Jr NTR : లోకేశ్‌కు అడ్డు వస్తాడనే భయంతో జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు-కొడాలి నాని సంచలన ఆరోపణలు

లోకేశ్ కు అడ్డు వస్తాడని జూ.ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, చంద్రబాబు డీఎన్ఏని సర్వ నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.(Kodali Nani On Jr NTR)

Kodali Nani On Jr NTR : లోకేశ్‌కు అడ్డు వస్తాడనే భయంతో జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు-కొడాలి నాని సంచలన ఆరోపణలు

Updated On : December 9, 2022 / 7:39 PM IST

Kodali Nani On Jr NTR : తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపైన మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. తెరమీదకు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి చంద్రబాబు టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారాయన. ఏపీలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందని.. నారా లోకేశ్ కు అడ్డు వస్తాడని జూ.ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.

లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, చంద్రబాబు డీఎన్ఏని సర్వ నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. బీసీలే ఎన్టీఆర్ డీఎన్ఏ అంటున్నారని.. అయితే ఆ వర్గాలను టీడీపీ సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు.

Also Read..CM Jagan Target 175 : కొత్తగా 5లక్షల 20వేల మంది నియామకం.. 175 స్థానాలే లక్ష్యంగా సీఎం జగన్ ఖతర్నాక్ స్కెచ్

”ఎన్టీ రామారావు డీఎన్ఏ బీసీలు. ఎన్టీఆర్ పిల్లలను అనాథలను చేశారు. చెట్టుకొకరిని, పుట్టకొకరిని చేశారు. గాలికి వదిలేశారు. లోకేశ్ రాజకీయాలకు అడ్డం వస్తాడేమో అని, ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ డీఎన్ఏగా ఉన్న బీసీలంతా ఎన్టీఆర్ తో పాటు నడుస్తారని, ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేశారు. పప్పు సుద్ద లాంటి సన్నాసి, మాట్లాడటం కూడా చేతకాని మాలోకం లోకేశ్ ను తీసుకొచ్చి మీ మీద(బీసీలు) రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఫైర్ అయ్యారు కొడాలి నాని.

Also Read..Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్

”లోకేశ్ కు అడ్డు వస్తాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారు. లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని ఒక కులం పన్నాగాలు చేస్తోంది. ఎన్టీ రామారావు, వైఎస్ఆర్ కలిస్తే ఉండేంత దమ్ము కేవలం సీఎం జగన్ కు మాత్రమే ఉంది. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉంది” అని కొడాలి నాని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

లోకేశ్ కు అడ్డు వస్తాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేస్తున్నారు అంటూ కొడాలి నాని చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, టీడీపీ నేతలు మాత్రం కొడాలి నాని ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఆ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న కొడాలి నాని.. ఛాన్స్ చిక్కితే చాలు జూ.ఎన్టీఆర్ ప్రస్తావన తెరపైకి తెస్తున్నారని, ఇది కొడాలి నాని మైండ్ గేమ్ అని తమ్ముళ్లు అంటున్నారు. టాపిక్ ను డైవర్ట్ చేసేందుకే కొడాలి నాని ఇలా ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెస్తారని వారు ఎదురుదాడికి దిగారు.