Parthasarathy
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైసీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి అన్నారు. గతంలో నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలానే వైసీపీ నేతలు చొరబడ్డారని తెలిపారు. తన షెడ్యూల్ ఆలస్యం వల్లే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రానికి వాయిదా పడిందని చెప్పారు.
ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనలేదని చెప్పారు. వ్యక్తిగతంగా జోగి రమేశ్ కు, తనకు ఎలాంటి బంధమూ లేదని తెలిపారు.
తెలుగుదేశం కార్యకర్తల మనసు బాధిపడినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ తనకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోనని తెలిపారు. వైసీపీలో సామాన్య ప్రజలతో తనకున్న బంధాన్ని తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తున్నానని చెప్పారు. పాత పరిచయాలతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపారు.
D. Raja: భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం: డి.రాజా