Konaseema : అమలాపురం అలర్ల ఘటనపై మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు..అజ్ఞాతంలో నిందితులు

కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులతో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

Konaseema District name change  : కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులతో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘు అనే నలుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఏ222 నిందితుడు సత్యప్రసాద్ వాంగ్మూలంతో వీరిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కేసులు నమోదు చేయటంతో వైసీపీ నేతలు నలుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Also read :KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?

కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read : Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు

ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను.. A-225గా సత్యరుషి, A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం (13,2022)పర్యటించారు. గత నెలలో చోటుచేసుకున్న అల్లర్లలో ధ్వంసమైన మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌ ఇళ్లను, కలెక్టరేట్‌ ప్రాంతాన్ని డీజీపీ పరిశీలించారు.

Also read : Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి

ట్రెండింగ్ వార్తలు