Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి

అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ..(Amalapuram High Tension)

Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి

Amalapuram High Tension

Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. జిల్లా పేరును కోనసీమగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలో భారీ ఎత్తున ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఎటువంటి సమావేశాలు, ర్యాలీలు చేయకూడదని 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా ఆందోళనకారులు లెక్క చేయలేదు. పెద్దఎత్తున అమలాపురం చేరుకున్నారు. ముఖ్యంగా యువకులు పెద్ద మొత్తంలో వ్యూహాత్మకంగా అడుగు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని చెల్లాచెదురు చేస్తున్నారు.

ఆందోళనకారుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. ఇదే సమయంలో కొందురు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైంది.

పరిస్థితి చేయి దాటి పోవడంతో స్వయంగా కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. లాఠీ చేతబట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అమలాపురంలో ఎక్కడికక్కడ యువకులను అడ్డుకుంటున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.(Amalapuram High Tension)

Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు

అమలాపురం.. రణరంగం..
మరోవైపు కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాలతో ర్యాలీగా అమలాపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అమలాపురం పట్టణం రణరంగంగా మారింది. ఎక్కడ చూసినా పోలీసులను మోహరించారు. దీంతో అమలాపురం పట్టణం కాకీమయంగా మారింది. దొరికిన వాళ్లను దొరికినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Konaseema

Konaseema

ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి..
కోనసీమ జిల్లాకు మద్దతుగా అమలాపురం బస్ స్టాండ్ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నారు యువకులు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ గన్ మెన్ కు గాయాలయ్యాయి. రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. మరోవైపు దుండగులు ఎస్పీ వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.(Amalapuram High Tension)

కోనసీమ జిల్లా పేరు మార్పుతో చెలరేగిన వివాదం..
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. జిల్లా పేరును మార్చడంపై మండిపడుతున్నారు. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమలాపురంలో నలుగురు డీఎస్పీలతో పాటు 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

ఓవైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీసులు.. దీంతో కోనసీమ అట్టుడుకుంతోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పారు.

అప్పుడు పేరు మార్చాలని, ఇప్పుడు పేరు మార్చొద్దని ఆందోళనలు..
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ఇప్పుడు జగన్‌ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని అంబేద్కర్‌ వాదులు గతంలో ఆందోళనలు కూడా చేశారు. తీరా పేరు మార్చాక.. ఇప్పుడేమో పేరు మార్చొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు.(Amalapuram High Tension)