Konijeti Rosaiah No More: కన్నీరుమున్నీరైన రఘువీరారెడ్డి

మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.

AP Raghuveer Reddy : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారన్న సంగతి తెలుసుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య..గుండెపోటుతో మృతి చెందడం చాలా ఇబ్బంది అనిపించిందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో రోశయ్య లేకపోతే..చూడాలంటే ఎలాగో ఉండేదన్నారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. సుధీర్ఘ రాజకీయ వేత్తగా ఉన్న ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారం తెలియచేశారన్నారు. 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం జరిగే రోశయ్య గారి అంత్యక్రియలలో తాను పాల్గొనడం జరుగుతుందన్నారు.

Read More : Mahaprasthanam : రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2009లో రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వహించారు. వయసు పైబడడంతో కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం , రాజకీయల్లో తలపండిన నేతగా గుర్తింపు, రాష్ట్రంలో దీర్ఘ కాలంపాటు ఆర్ధిక శాఖను ఒంటి చేత్తో నడిపిన నేర్పరితనం, ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం, రాజకీయల్లో ఉద్దండుడిగా గుర్తింపు ఇలా అనేక కోణాల్లో ఒక రాజకీయ నేతకు గుర్తింపు రావడం చాలా అరుదు… కానీ సామాన్యుడిగా మొదలై అసామాన్యుడుగా రాజకీయల్లో ఎదిగిన మాజీ ముఖ్యమంత్రి గా కన్నా మాజీ ఆర్ధిక మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు రోశయ్య..

Read More : Konijeti Rosaiah: రోశయ్య మృతిపై.. సంతాపాల వెల్లువ

ఇక రఘువీరారెడ్డి విషయానికి వస్తే..ఈయన రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వ్యవసాయ శాఖగా మంత్రిగా పని చేయడమే కాకుండా…అనంతపురం పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. ఈయన…ప్రస్తుతం రాజకీయాలను అటకెక్కించారు. వ్యవసాయ జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లగడ్డం, మెడలో తెల్లటి కండువా..లుంగీతో కనిపించిన ఆయన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. రైతుగా కనిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ట్రెండింగ్ వార్తలు