Mahaprasthanam: చేవెళ్లలో రోశయ్య అంత్యక్రియలు

రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2009లో రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Mahaprasthanam: చేవెళ్లలో రోశయ్య అంత్యక్రియలు

Konijeti Rosaiah

Rosaiah Funeral : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముందుగా అనుకున్నట్లుగా మహాప్రస్థానంలో నిర్వహించట్లేదు. రోశయ్య అంత్యక్రియలు 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్లలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

స్టార్ ఆసుపత్రి నుంచి రోశయ్య పార్థీవదేహాన్ని…అమీర్ పేటలోని ఆయన నివాసానికి తరలించారు. 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం ఉదయం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు స్టార్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం గాంధీభవన్ కు రోశయ్య భౌతికకాయాన్ని తరలించనున్నట్లు..ప్రజల సందర్శనార్థం..మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ వెల్లడించారు. మధ్యాహ్నం 12.30 తర్వాత…గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుందని, మధ్యాహ్నం ఒంటి గంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Read More : Chandrababu: అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రోశయ్య -చంద్రబాబు

రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2009లో రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వహించారు. వయసు పైబడడంతో కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా చెరగని ముద్రవేశారు. సీనియర్ శాసనసభ్యునిగా ఉమ్మడి సభలో ఆయనంటే ప్రత్యేక గౌరవం ఉండేది. నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా పనిచేశారు. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య సొంతం. రోశయ్య శాసన సభలో ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది.

తన మాటల చాతుర్యంతో ఛలోక్తులతో..సభలో నవ్వులు పువ్వులు పూయించేవారు. ముఖ్యమంత్రులకు కుడిభజంగా వ్యవహరించేవారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థికమంత్రిగా ఉంటూనే అన్ని విషయాల్లో వైఎస్‌కు చేదోడువాదోడుగా నిలిచారు.

Read More : Konijeti Rosaiah Passes Away: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా , గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో దురందరుడిగా పేరు గడించారు. ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఏకంగా 15 సార్లు బడ్జేట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు రోశయ్య..