Kottu Satyanarayana (Photo : Google, Twitter)
Kottu Satyanarayana : టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రపై విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అసలు లోకేశ్.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అవడానికి పాదయాత్ర చేస్తున్నారా? లేక తండ్రిని సీఎంని చేయడానికి పాదయాత్ర చేస్తున్నారా? ఇంతకీ లోకేశ్ పాదయాత్ర దేనికోసం? అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు బ్రోకర్, ఆయన కొడుకు జోకర్ అనేది ప్రజల అభిప్రాయం అని మంత్రి కొట్టు అన్నారు. సైకిల్ పోవాలని అంటాడు, తనను తానే తిట్టుకుంటాడు. ఇదీ లోకేశ్ వైఖరి అని ఎద్దేవా చేశారు.
ఇక చంద్రబాబుకు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం సాధారణమైనదే అన్నారు మంత్రి కొట్టు. చంద్రబాబు జన్మదినానికి సీఎం జగన్, సీఎం జగన్ జన్మదినానికి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం మామూలే అని ఆయన గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెప్పడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారని, కామెంట్లు పెట్టడం నెటిజన్లకు అదో సరదా అని మంత్రి అన్నారు.
Also Read..TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి
” లోకేశ్ పాదయాత్ర జోక్ లాగా మారింది. లోకేశ్ తాను సీఎం కావడానికా? తన తండ్రి సీఎం అయ్యేందుకా? ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు. సంక్షమ పథకాలు అందుకుంటున్న వారి వద్దకే వెళ్లి లోకేశ్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, దగా, మోసం, అవినీతి, నిలువెల్లా విషం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు” అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.