Kottu Satyanarayana: పవన్ కల్యాణ్.. లారీని లారీ అనక ఇంకేమంటారు? వారాహి అమ్మవారు నిన్ను శిక్షిస్తుంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ ఎందుకు అంటిపెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాదని అన్నారు.

Kottu Satyanarayana

Kottu Satyanarayana – Pawan Kalyan: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి నియోజకవర్గంలో అమ్మఒడి కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ ఎందుకు అంటిపెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాదని అన్నారు. పవన్ కల్యాణ్ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ వాహనాన్ని ఏపీ సీఎం జగన్ లారీ అని అన్నారు. దీంతో ఆయనకు తెలుగు రాదంటూ పవన్ ఎద్దేవా చేశారు.

దీనిపై కొట్టు సత్యనారాయణ స్పందించారు. వారాహి అన్నది అమ్మవారి పేరని చెప్పారు. లారీని లారీ అనక ఇంకేమంటారని నిలదీశారు. అమ్మ వారి పేరు పెట్టిన వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ చెప్పే అసత్యాలు విని ఆ వారాహి అమ్మవారు ఆయనను శిక్షిస్తుందని చెప్పారు.

చంద్రబాబు అధికారంలో ఉంటేనే పవన్ కు ప్యాకేజీ వస్తుందని కొట్టు సత్యనారాయణ్ అన్నారు. అందుకే చంద్రబాబుకి పవన్ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా అమ్మఒడి అందించామని తెలిపారు.

MLA Duddilla Sridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనగర్జన బహిరంగ సభ ఆగదు