Kottu Satyanarayana
Kottu Satyanarayana : మే 12 నుండి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆరు రోజులపాటు ఎప్పుడూ చేయని అతిపెద్ద కార్యక్రమం దేవాదాయ శాఖ చేస్తోందన్నారు. మొదటి రోజు, చివరి రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు యజ్ఞఫలం అందాలని, సంక్షేమ రాజ్యంగా పేరుగాంచిన ప్రభుత్వం.. మరింత విసృతంగా కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
మొదటి రోజు గోపూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచం, దీక్షాధారణ, అజప్రదీపారాధనతో మొదలవుతుందన్నారు. 108 కుండాలు, రెండు ప్రధాన మహా కుండాలతో ఈ కార్యక్రమం ఉంటుంది. 4 ప్రధాన ఆగమాలు, నాలుగు మిగిలిన ఆగమాల ప్రకారం కార్యక్రమాలు ఉంటాయి. మే 16న 10050 కలశాలతో శ్రీ లక్ష్మీ విశిష్ట అభిశేఖం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
Also Read..TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి
* 6 రోజులు రోజుకు ఒకరు చొప్పున శారదాపీఠం, కంచికామకోటి, అంగేరి, పుష్పగిరి, చిన్నజీయర్, సిద్ద జీయర్ పీఠాల నుండి పీఠాధిపతులు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు.
* ప్రవచనకర్తల ప్రవచనాలు ప్రతిరోజూ ఉంటాయి.
* ధర్మప్రచార రథాలను కూడా ప్రదర్శకు పెడుతున్నాం.
* 108 కుండాలకు 432 మంది రుత్వికులు, ప్రధాన కుండాలకు 16 మంది రుత్వికులు, వారికి తోడు సహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
* ప్రతిరోజు విష్ణు సహస్రనామాది పారాయణం, వేద పండితుల సంపూర్ణ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.