Farmer Found Diamond : రైతుని వరించిన అదృష్టం, పొలంలో దొరికిన విలువైన వజ్రం.. కానీ

వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా రైతుకి వజ్రం దొరికింది. ఆ రైతు ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి అమ్మేశాడు. Kurnool - Diamond

Kurnool - Diamond

Kurnool – Diamond : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఓ రైతును అదృష్టం వరించింది. జొన్నగిరి గ్రామానికి చెందిన ఆ రైతుకు అతడి పొలంలోనే వజ్రం లభించింది. దాన్ని స్థానిక వ్యాపారి లక్షా 50వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో రూ.10లక్షలకు పైనే ఉన్నట్లు సమాచారం.

వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా రైతుకి వజ్రం దొరికింది. ఆ రైతు ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి అమ్మేశాడు. వ్యాపారి రూ.లక్షా 50వేలు ఇచ్చి వజ్రం కొనుగోలు చేశాడు. కాగా, మార్కెట్ లో దాని విలువ రూ.10లక్షలకు పైనే ఉంటుందని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

Also Read..CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు లభ్యమవుతున్నాయి. గతంలో అనేకమందికి విలువైన వజ్రాలు దొరికాయి. వారి జీవితాలే మారిపోయాయి. రాత్రికి రాత్రి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. పొలాల్లో వజ్రాలు దొరుకుతున్న విషయం అంతటా వ్యాపించింది. దాంతో స్థానికులే కాదు ఇతర ప్రాంతాల వారు కూడా జొన్నగిరికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. వ్యవసాయ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు.

ఈ క్రమంలో కొందరిని అదృష్టం వరించింది. తమకు దొరికిన వజ్రాలను వారు స్థానిక వ్యాపారులకు అమ్మేస్తారు. అయితే, ఈ వ్యవహారంలో వ్యాపారులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతులకు దొరికిన వజ్రాలను వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్ లో వారు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కష్టం రైతులది అయితే, లబ్ది పొందుతున్న మాత్రం వ్యాపారులు అని వాపోతున్నారు.

అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అద్భుతం జరిగిపోతుంది అంతే. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. నిరుపేద సైతం సంపన్నుడు అయిపోతాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతారు. అక్కడి రైతులకు అదృష్టం వజ్రం రూపంలో పలకరించింది.

Also Read..Drinking Too Much Tea : మోతాదుకు మించి టీ తాగటం వల్ల కలిగే ఆరోగ్యపరమైన అనర్ధాలు

కర్నూలు జిల్లాలో పంట పొల్లాల్లో వజ్రాల కోసం వేట సర్వసాధారణం. వర్షాలు కురిసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. పొలాల్లో వెతుకులాడతారు. అదృష్టం ఉంటే వజ్రం దొరుకుతుంది లేదంటే లేదు. కర్నూలు జిల్లా తుగ్గలి, పెరవలి, జొగన్నగిరి ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు వానొస్తే చాలు పొలాల బాట పడతారు. ఒక్క వజ్రమైనా దొరకకపోదా, తమ లైఫ్ సెట్ కాకపోదా అనే ఆశతో వజ్రాల వేట సాగిస్తారు.