Byreddy Siddharth Reddy : లోకేశ్‌తో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి..? క్లారిటీ వచ్చేసినట్టేనా..!

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నారా?లోకేశ్ తో భేటీ అయ్యారా? టీడీపీ కర్నూలులోని నియోజవర్గాలన్నీ బైర్రెడ్డి చేతిలో పెట్టనుందా?

Byreddy Siddharth Reddy

Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నారా? గత కొద్ది రోజులుగా బైరెడ్డి పార్టీ మారుతున్నరంటూ జోరుగా వార్తలు వస్తున్నాయ్. యూత్ నేతగా పార్టీలో గుర్తింపు ఉన్న బైరెడ్డి కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారని.. వైఎస్సార్‌సీపీని వీడతారని ప్రచారం జరిగింది. ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లిందట.CM జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సిద్ధార్థ్ పార్టీ టీడీపీలోకి చేరుతారనే చర్చ కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సిద్ధార్ధ్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ అంటే ఎంతో అభిమానం. అలాంటి వ్యక్తి పార్టీ మారతారన్న ప్రచారం ఎలా తెరపైకి వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది.

Also read : Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?

యూత్ లీడర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్డ్ రెడ్డి పార్టీ మారతారనే విషయం కర్నూలు జల్లా రాజకీయాలను షేక్ చేస్తోంది. దీంట్లో భాగంగా సిద్ధార్డ్ రెడ్డి లోకేశ్ లో భేటీ అయ్యారనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని అందుకే సిద్ధార్డ్ రెడ్డి టీడీపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఒకప్పుడు బైర్రెడ్డి కుటుంబానికి టీడీపీ మంచి అనుబంధం ఉండేది. నందికొట్కూరు కేంద్రంగా బైర్రెడ్డి కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోంది.సిద్ధార్డ్ రెడ్డి తాత బైర్రెడ్డి శేష సయనరెడ్డి టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 వరకు సిద్ధార్డ్ రెడ్డి కూడా టీడీపీలోనే కొనసాగారు. ఆ తరవాత జరిగిన అనూహ్య పరిణామాలతో సిద్ధార్ధ్ వైసీపీలో జాయిన్ అయ్యారు. నందికొట్కూరు వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. దీంతో నందికొట్కూర్ లో ఎమ్మెల్యే ఆర్థర్ కు సిద్ధార్ద్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

Also read : Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ

దీంతో స్థానికంగా జరిగే ప్రతీ ఎన్నికల్లోనే తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవటంలో ఇద్దరు పోటీ పడుతుంటారు. వీరిద్దరి మధ్య ఉన్న్ ఈ వైరాన్నిమాజీ మంత్రి ..జిల్లా ఇన్ చార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరింతగా పెంచారనే వార్తలు ఉన్నాయి.

ఈక్రమంలో పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కటంలేదనే ఆయలోనలో సిద్ధార్డ్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. సిద్ధార్డ్ రెడ్డి సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వటంలేదనే కారణంతో జిల్లా వైసీపీ నేతలు సిద్ధార్డ్ విషయంలో భావిస్తున్నారట. దీంతో సిద్దార్డ్ కు ఉన్న యూత్ క్రేజ్ ను ఆ పార్టీలో ఉన్న ఓ అనుచర వర్గం తగ్గించటానికి యత్నాలు చేస్తోందట. ఈ విషయం తెలిసాకే సిద్ధార్డ్ రెడ్డి తను వేరే దారి వెతుక్కుంటున్నట్లుగా దాంట్లోభాగంగానే టీడీపీలో చేరటానికి మంతనాలు జరుపుతున్నారనే విషయం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Also read : Top 5 Smartphones : మార్కెట్లో ఈ ఫోన్లకే ఫుల్ డిమాండ్.. టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు మీకోసం.. ఏ ఫోన్ బెస్ట్ అంటే?

ఈక్రమంలో సిద్దార్డ్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు..టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దార్డ్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని..అందుకే ఆయన లోకేశ్ తో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నందికొట్కూరు, శ్రీశైలంతో పాటు కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలను బైర్రెడ్డి సిద్ధార్థ్ చేతిలో పెట్టటానికి టీడీపీ అంగీకరించింది అని మరో టాక్ నడుస్తోంది. ఈ ఆఫర్ నచ్చాకే బైర్రెడ్డి సిద్ధార్డ్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవ్వటానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కానీ సిద్ధార్డ్ రెడ్డి అనుసరులు మాత్రం ఆయన పార్టీ మారుతాను అనటంలో ఎటువంటి నిజం లేదంటున్నారు. ఐతే ఓ  ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. తాను లోకేశ్ తో కలవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ కోసం పనిచేస్తానని జగన్ వెంటే ఉంటానని చెప్పారు.