Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గద్వాల జిల్లాలో చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ...

Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ

Bandi Sanjay

Bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గద్వాల జిల్లాలో చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర గద్వాల మండలంలోని జిన్నింగ్ మిల్స్ నుండి ప్రారంభమైంది. అక్కడి నుండి అయిజ – గద్వాల రహదారి మీదుగా మేళ్ళచేరువు క్రాస్ రోడ్, ఫ్లై ఓవర్, అంబేద్కర్ చౌక్, సినిమా థియేటర్ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా గద్వాల పట్టణానికి పాదయాత్ర చేరుకుంటుంది. పాదయాత్ర 12 కి.మీ కొనసాగిన అనంతరం టీటీడీ కళ్యాణ మండపం దగ్గర బండి సంజయ్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. యాత్రలో భాగంగా గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని తేరుమైదానంలో సాయంత్రం 5గంటలకు బీజేపీ భారీ బహిరంగ నిర్వహించనుంది.

Bandi Sanjay Yatra: తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే, కానీ రాజ్యమేలుతోంది పెద్దోళ్ళు: బండి సంజయ్

ఈ సభకు ముఖ్యఅతిథిగా తమిళనాడు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. గతవారం రోజులుగా బండిసంజయ్ రెండ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. గద్వాల జిల్లాలోని గ్రామాల్లో పర్యటిస్తూ సంజయ్ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్లదాడులు చేసుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల దాడి తీవ్రత పెరిగింది. బండి సంజయ్ పాదయాత్రకు కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర గద్వాల పట్టణంలోకి చేరుకుంటున్న సందర్భంగా పట్టణ కేంద్రంలోని తేరు మైదానంలో సాయంత్రం 5గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించన్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.