Bandi Sanjay Yatra: తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే, కానీ రాజ్యమేలుతోంది పెద్దోళ్ళు: బండి సంజయ్

పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.

Bandi Sanjay Yatra: తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే, కానీ రాజ్యమేలుతోంది పెద్దోళ్ళు: బండి సంజయ్

Bandi

Updated On : April 18, 2022 / 1:02 PM IST

Bandi Sanjay Yatra: “తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే… ఇప్పుడు రాజ్యమేలుతోంది పెద్దోళ్లే..పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి” అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జోగులంబ గద్వాల జిల్లా వేముల వద్దకు చేరుకుంది. ఈసందర్భంగా బండి సంజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ..అధికార టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మిర్చి పంటకు తెగులొస్తే సీఎం కేసీఆర్ సాయం చేయలేదని..పండిన మిర్చిని అమ్ముకుందామంటే..మార్కెట్ లేక, రైతులు దళారులకు అమ్మి మోసపోతున్నారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడూ రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణకు 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేశారని..కేసీఆర్ చేసిందేమీ లేదని బండి సంజయ్ అన్నారు.

Also read:MLA Wife Suicide : ఉరి వేసుకుని ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

రాష్ట్ర ప్రభుత్వం తరుపున పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించని కేసీఆర్ నిధులు దారిమళ్లించారని సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ఇండ్లన్నీ పూర్తి చేస్తే మరో 2 లక్షల ఇండ్లు ఇప్పిస్తానని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని బండి సంజయ్ అన్నారు. ప్రజల్లో బీజేపీకి సపోర్ట్ పెరుగుతుందనే అక్కసుతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పంచుతున్న రేషన్ బియ్యంలో కేంద్రం ప్రభుత్వం రూ.29 ఇస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయి మాత్రమే జతచేస్తుందని సంజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలోని గ్రామాల్లో జరిగే అభివ్రుద్ధి పనులకు నిధులిచ్చేది కేంద్రమేనని, కానీ టీఆర్ఎస్ చేసిందంటూ కేసీఆర్ పచ్చి అబద్దాలతో దుష్ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.

Also read:Andhra pradesh : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి పదవులొచ్చాయని, కానీ తెలంగాణలో యువకులకు మాత్రం కేసీఆర్ ఉద్యోగాలివ్వడం లేదని ఆయన అన్నారు. “తాము చస్తే పేదోళ్ల రాజ్యమొస్తుందనే ఆశతో పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారి సహా ఎందరో యువకులు తెలంగాణ కోసం బలిదానాలు చేశారన్న” బండి సంజయ్..కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ సాధించుకుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లేనని.. కానీ ఇప్పుడు రాజ్యమేలుతోంది మాత్రం పెద్దోళ్లని విమర్శించారు.

Also read:Hyderabad : బంజారా హిల్స్ కబ్జా స్ధలం.. కధా కమామీషు

దుబ్బాక,హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టారుకానీ, ప్రజలు టీఆర్ఎస్ ను వ్యతిరేకించారని బండి సంజయ్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్డీఎస్, నెట్టెంపాడు నీళ్లిచ్చి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, రాష్ట్రంలో నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను కాపాడుతామని సంజయ్ తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలు ధరలను పెంచుతోందంటూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్..రాష్ట్రంలో వ్యాట్ పేరుతో లీటర్ కు రూ.30 వసూలు చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం