Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?

ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతలంతా డైలమాలో పడ్డారు. దానికి కారణం లేకపోలేదు..ఇంతకీ ఆ కారణం ఏమింటంటే..?

Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?

T.cong Confuse

T.Congress confusion over Prashant Kishore joining Congress party : కాంగ్రెస్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది.కాకలు తీరిన నేతలుండే పార్టీ.. అందరినీ కన్ఫ్యూజ్ చేసే పార్టీనే.. కన్ఫ్యూజన్‌లో పడటమేంటనే డౌట్ వద్దు. ఇప్పుడు హస్తం పార్టీలో.. కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు.. కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడాలన్న దానిమీదే.. ఇప్పుడంతా ఫోకస్ పెట్టారు.

క అనే అక్షరం ఎత్తితే చాలు.. 120 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటుంది కాంగ్రెస్. అలాంటి.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి.. పెద్ద చిక్కే వచ్చిపడింది. దేశవ్యాప్తంగా.. పార్టీకి ఆదరణ తగ్గిపోవడం, ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో.. ప్రభావం చూపలేక.. ప్రాభవం కోల్పోతూ వస్తోంది. చివరికి.. అధిష్టానం మీదే తిరుగుబాటు మొదలైంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతున్నా.. హైకమాండే.. సుప్రీం. అలాంటిది.. గాంధీ ఫ్యామిలీపై.. జీ-23 నేతల తిరుగుబాటుతో.. పార్టీలో సందిగ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్.. హస్తం పార్టీ వైపు చూస్తుండటం.. వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అవుతుండటం.. చర్చనీయాంశంగా మారింది. పీకే సలహాలు, సూచనలతో.. పార్టీకి కొత్త జవసత్వాలు వస్తాయని.. కింది స్థాయి కేడర్‌ ఆశాభవంతో ఉంది.

Also read : CM Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!

అయితే.. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓ రకంగా ఆలోచిస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. పీకే విషయంలో.. ఇక్కడి నేతల్లో డైలమా నెలకొంది. అతను గనక.. కాంగ్రెస్‌లో చేరితే.. తమ పరిస్థితి ఏంటనే డౌట్ మొదలైందని.. గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతలా.. ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే.. పీకే తెలంగాణలో టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్‌లో చేరితే.. రాష్ట్ర ప్రజల్లోకి.. ఎలాంటి సిగ్నల్ వెళ్తాయనే టెన్షన్ పట్టుకుంది.

అంతేకాదు.. గతంలో పీకే విషయంలో కాంగ్రెస్ నేతలంతా ఒంటికాలిపై లేచారు. అలా ఎందుకు చేశారంటే.. రెండో కాలు కూడా లేపితే కిందపడిపోతామని.. వాళ్లకు తెలుసు. అందుకే.. ఒంటి కాలి మీదే లేచారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా.. ఎన్నోసార్లు పీకేపై ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డితో పాటు మిగతా కీలక నాయకులంతా.. ప్రశాంత్ కిశోర్‌పై గాంధీభవన్‌లో పేరుకుపోయిన దుమ్మంతా ఎత్తిపోశారు. పార్టీలో ప్రతి కార్యకర్త.. ఒక పీకేనే అని చెప్పారు రేవంత్. ఇంత భారీ డైలాగులు దంచిన తర్వాత.. పీకే కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు రావడంతో.. ముఖ్య నేతలందరి గుండెలు అదురుతున్నాయట.

Also read : Congress Party: ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌లో చర్చ.. 72గంటల్లో తుది నివేదిక..

అంతేకాదు.. ప్రశాంత్ కిశోర్ గనక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే.. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలుంటాయనే టెన్షన్ కూడా పట్టుకుంది. కేంద్రంలో బీజేపీని ఢీకొట్టాలంటే.. ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలని పీకే సలహాలిస్తున్నారు. అందువల్ల.. తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా కొట్లాడుతున్న టైంలో.. హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందన్నది.. అంతుచిక్కడం లేదట. అందువల్ల.. త్వరలో తెలంగాణలో జరగబోయే రాహుల్ గాంధీ టూర్‌లో.. ఈ విషయం మీద క్లారిటీ తీసుకోవాలని.. కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్‌తో పాటు ఎంఐఎం విషయంలోనూ.. స్పష్టమైన విధానాన్ని ప్రకటించేలా చూడాలని పట్టుబడుతున్నారు.