CM Ys Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!
మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ షాక్ ఇవ్వటానికి కారణమేంటి..?!

Cm Jagan Shocks 3 Mlas For Expelling Ministerial Post
CM Ys Jagan : కొండ నాలుకకి మందేస్తే.. ఉన్న నాలుక పోయిందన్నట్లు.. మంత్రి పదవులకు టార్గెట్ పెట్టుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు.. చివరికి పార్టీ పదవులు కూడా దక్కకుండా పోయాయ్. ఎంటైర్ వైసీపీలో.. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. అదృష్టం కలిసిరాక.. దరిద్రం వీడిపోక.. గట్టిగా అడగలేక.. ఇంక చేసేదేమీ లేక.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తెగ ఇబ్బందిపడిపోతున్నారు. ఇంతకీ.. ఎవరు వాళ్లు.. సీఎం జగన్ వాళ్లకు డబుల్ షాక్ ఎందుకిచ్చారు?
రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వరకు ఎలా ఉన్నా.. ఒకసారి ఎంట్రీ ఇచ్చాక.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. పెద్ద పెద్ద పదవులు దక్కించుకుంటూ.. ఉన్నతస్థాయికి వెళ్లాలని.. ప్రతి నాయకుడు ప్రయత్నిస్తుంటారు. ఇక.. పదవుల కోసం జరిగే రేసులో.. అందరికంటే ముందుండాలని తపించని పొలిటీషియన్ ఉండనే ఉండరు. చాలా మంది నేతలు.. ఉన్నత పదవులు ఆశిస్తుంటారు. భంగపడుతుంటారు. ఇవన్నీ.. మామూలే. కానీ.. మంత్రి పదవులను ఆశించి.. భంగపడి.. అలక బూని.. అధిష్టానం చేత బుజ్జగింపజేసుకొని.. చివరకి.. పార్టీకి సంబంధించిన పదవైనా సరే అనే.. హామీ తీసుకొని.. అక్కడ కూడా చాన్స్ రాక.. సైలెంట్ అయిపోవడం.. చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇప్పటివరకు చెప్పిన సీన్ అంతా.. ఇప్పుడు వైసీపీలోనే కనిపిస్తోంది. ఈ పరిస్థితి.. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు పార్థసారథి, సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డిదే.
Also read : Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ
కేబినెట్ విస్తరణ అయిపోయింది. తాజాగా.. వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను కూడా అధిష్టానం ఎంపిక చేసింది. ఇప్పుడు.. సీఎం జగన్.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇచ్చిన షాక్ మామూలుగా లేదని.. పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పార్థసారథి, ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎవరికి వారు.. పార్టీకి, నాయకుడు జగన్‌కి అత్యంత విధేయులు. ఈ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు.
కానీ.. వారి ఆశల మీద నీళ్లు చల్లి.. కేబినెట్‌లో చోటివ్వలేదు. దీంతో.. పార్థసారథి, సామినేని ఉదయభాను తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. శిల్పా చక్రపాణి రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో.. అసంతృప్త నేతలను.. తాడేపల్లికి పిలిపించుకొని.. జగనే బుజ్జగించారు. మీకెందుకు.. నేనున్నాను కదా. ఏదో రకంగా సెట్ చేస్తానని చెప్పారు. మంత్రివర్గంలో చోటివ్వలేదు కాబట్టి.. జిల్లా అధ్యక్ష పదవైనా, రీజినల్ కో ఆర్డినేటర్ పోస్ట్ అయినా వస్తుందని.. ఈ ముగ్గురు నేతలు అనుకున్నారు. కానీ.. ఈ లిస్టుల్లోనూ.. వీళ్ల పేర్లు లేకపోవడంపైనే.. వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.
మంత్రి పదవులు ఆశించడం, భంగపడటం మామూలే. ఎందుకంటే.. మినిస్టర్ పదవి దక్కాలంటే.. చాలా ఈక్వేషన్స్ కలిసి రావాలి. ముఖ్యంగా.. సామాజిక సమీకరణాలు కుదరాలి. కాంబినేషన్లు సెట్ కావాలి. వీటితో పాటు పెసరగింజంతైనా లక్ ఉండాలి. అధినేత ఆశీస్సులుండాలి. కానీ.. ఇవేవీ.. ఈ ముగ్గురు నేతలకు కలిసిరాలేదు. ఇప్పటికే.. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు రాక ఫీలైపోతుంటే.. పుండు మీద కారం చల్లినట్లు.. పార్టీ పదవులు కూడా దక్కకపోయేసరికి.. లోలోపల తెగ బాధపడిపోతున్నారని.. వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు.