Laxminarayana : ఎన్నికల్లో పోటీ చేస్తా: లక్ష్మీనారాయణ

ప్రజలకు మాత్రం అధికారం రావాలని కోరుకుంటానని తెలిపారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన అభిప్రాయం తెలిపారు. జిల్లాలను పెంచడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుందని...

Jd

Laxminarayana : తాను ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం జరుగుతుందని ప్రకటించారు మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ. అందరికీ మేలు చేసేందుకే హైదరాబాద్ లో కొందరు కాపు నాయకులతో సమావేశం అవ్వడం జరిగిందని తెలిపారు. కాపులకు రాజ్యధికారం కోసం కాపు నాయకులతో సమావేశమైనట్లు కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. ప్రజలకు మాత్రం అధికారం రావాలని కోరుకుంటానని తెలిపారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన అభిప్రాయం తెలిపారు. జిల్లాలను పెంచడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాలు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని ఫైల్ లలో రాస్తే అధికారులు కోర్టులకు వెళ్లాల్సినవసరం లేదని, ఫైళ్లు కోర్టుకు పెంపితే సరిపోతుందన్నారు. మౌఖిక ఆదేశాలు పాటిస్తే అధికారులు దాని పర్యవసానం కూడా ఊహించాలని, ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు, అధికారులని తెలిపారు. స్కూల్ ఆవరణలో ఎలాంటి భవనాలు ఉండొద్దని కోర్టు చెప్పినా అక్కడ భవన నిర్మాణాలు జరగడతో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గా తీసుకున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

Read More : AP Smuggle Gold : ఉత్తరాంధ్రలో దశబ్దాలుగా గోల్డ్‌ జీరో దందా.. కోట్ల డబ్బు ఎవరిది ?

ఇక లక్ష్మీ నారాయణ విషయానికి వస్తే… సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో జనసేన సైతం ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ పరాజయం చెందారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి లక్ష్మీనారాయణ.. జనసేనకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. పవర్ ఫుల్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా, సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఫుల్ క్రేజ్ సంపాదించారు. జగన్ ఆస్తుల కేసులను డీల్ చేయడం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. సీబీఐ జేడీ పదవికి రాజీనామా చేశాక రాజకీయాల్లోకి వచ్చారు లక్ష్మీనారాయణ.

Read More : Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..

ముందు టీడీపీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత లోక్ సత్తాలోకి వెళ్తారని వార్తలొచ్చాయి. బీజేపీలోకి వెళ్తారని కూడా వార్తలు వినిపించాయి. చివరికి అవేవీ కాదని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో జాయిన్ అయ్యారు. పవన్, లక్ష్మీనారాయణ.. ఇద్దరూ కలవడంతో జనసేనకు ఓ ఊపు వచ్చింది. పవన్, మాజీ జేడీ జోడీ సూపర్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. పవన్ – మాజీ జేడీ జోడీ సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. చివరికి లక్ష్మీ నారాయణ జనసేనకు రిజైన్ చేశారు.