AP Smuggle Gold : ఉత్తరాంధ్రలో దశబ్దాలుగా గోల్డ్‌ జీరో దందా.. కోట్ల డబ్బు ఎవరిది ?

పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుబడ్డ 4 కోట్ల 78 లక్షలు ఎవరివి? అంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇచ్చేందుకు డబ్బు తీసుకుపోతున్నారు? ఈ గుట్టు తేల్చే...

AP Smuggle Gold : ఉత్తరాంధ్రలో దశబ్దాలుగా గోల్డ్‌ జీరో దందా.. కోట్ల డబ్బు ఎవరిది ?

AP Bus

Smuggling Of Cash And Gold : గుంటూరు కేంద్రంగా అక్రమ బంగారం దందా కొనసాగుతోందా.. బంగారం కొనేందుకు నగదును బస్సుల్లో తరలిస్తున్నారా.. ఒక్కరోజే మూడు బస్సుల్లో పది కోట్లకు పైగా నగదు దొరికితే.. మరి ఇన్నాళ్లూ ఇంకా ఎంత నగదు జిల్లాల సరిహద్దులు దాటుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాపారులు గుంటూరుకు డబ్బులు తీసుకొచ్చి.. అక్కడ బంగారం కొంటున్నారని పోలీసులు చెబుతున్నా.. ఆ నగదుకు, బంగారానికి అసలు రిసిప్టులున్నాయా.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో భారీగా డబ్బు సీజ్‌ అయితే.. శ్రీకాకుళం, పలాసల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

Read More : Andhra Pradesh : పద్మావతి ట్రావెల్స్ బస్సులో కోట్లకు కోట్లు నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం

ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా జీరో దందా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చీకటి వ్యాపారానికి నరసన్నపేట కేంద్రంగా ఉన్నట్టు జిల్లాలో టాక్‌ నడుస్తోంది. ట్యాక్స్‌లు చెల్లించకుండా నరసన్నపేటకు పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్స్‌, ఆభరణాలను వ్యాపారులు తరలిస్తున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం, పలాస, విజయనగరం, ఒడిశాలకు ఈ బంగారాన్ని తరలిస్తున్నారు అక్రమార్కులు. ఇటు పలాస్‌ కేంద్రంగా వందల కోట్ల జీడిపప్పు వ్యాపారం జరుగుతుండగా.. నగదు లావాదేవీలన్నీ కూడా గుట్టుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక బ్లాక్‌మనీ, హవాలాకు కూడా నరసన్నపేట కేంద్రంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.

Read More : Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుబడ్డ 4 కోట్ల 78 లక్షలు ఎవరివి? అంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇచ్చేందుకు డబ్బు తీసుకుపోతున్నారు? ఈ గుట్టు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. పద్మావతి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సహా 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సులో పట్టుబడ్డ 4 కోట్ల 78 లక్షల రూపాయల్ని నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ నగదును ట్రెజరీకి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బస్సులో 4 కోట్ల 78 లక్షల రూపాయలు తరలించడంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More : Jammu and Kashmir : అదుపు తప్పి లోయలో పడిన టాటా సుమో…ఆరుగురు మృతి

అసలా డబ్బు ఎవరిదన్న దానిపై వివరాలు సేకరించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 10మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి అసలు సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్‌ సహా 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు బస్సును వెనుక నుంచి ఫాలో కావడంతో వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.