Andhra Pradesh : పద్మావతి ట్రావెల్స్ బస్సులో కోట్లకు కోట్లు నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం

తీగ లాగితే కొండ కదిలినట్లు.. ఉభయగోదావరి జిల్లాల పోలీసుల తనిఖీల్లో ఈ దందా బయటపడింది. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉదయాన్నే పద్మావతి ట్రావెల్స్...

Andhra Pradesh : పద్మావతి ట్రావెల్స్ బస్సులో కోట్లకు కోట్లు నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం

Padmati

Padmavathi Travel : కోట్ల కోట్లకు కోట్లు నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం.. అటు నుంచి బస్సుల్లో లోడై నోట్ల కట్టలు వస్తుంటే.. ఇటు నుంచి బంగారం లోడై వెళ్తుంటే.. అటు నుంచి కరెన్సీ కట్టలు బస్సుల్లో తరలివస్తున్నాయి. మధ్యలో టోల్‌ ప్లాజా దగ్గర నోట్ల బాక్సులు ఈ బస్సులోకి.. బంగారం బిస్కెట్లు ఆ బస్సులోకి మారిపోతున్నాయి. విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందా బయటపడడంతో .. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఇంతకాలం ఎవరికీ అనుమానం రాకుండా సాగిన ఈ బిజినెస్‌లో సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.. అయితే.. ఈ బిజినెస్ అంతా పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లోనే జరుగుతుండడం.. అసలు సిసలు ట్విస్ట్.. ఈ ట్రావెల్స్ బస్సుల్లోనే ఈ దందా ఎందుకు నడుస్తుందన్నదే ఈ కేసులో కీలకంగా మారనుంది.

Read More : Heavy Cash Seize : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత

తీగ లాగితే కొండ కదిలినట్లు.. ఉభయగోదావరి జిల్లాల పోలీసుల తనిఖీల్లో ఈ దందా బయటపడింది. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉదయాన్నే పద్మావతి ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. పలాస నుంచి గుంటూరు వెల్తున్న ఈ బస్సులో 4 కోట్ల 78 లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ బస్సుల్లో సాగుతున్న ఈ దందాకు చెక్ చెప్పారు పోలీసులు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల్లో నగదు.. బంగారం మార్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఓ బస్సులో నుంచి 5 కోట్ల 6 లక్షల నగదును.. మరో బస్సులో నుంచి 10 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు.

Read More : TTD Temple: శ్రీవారి ఆలయంలో శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం

ఇంత డబ్బును ఎందుకు పట్టుకెళ్తున్నారన్నది ఆరా తీసేసరికి టోల్‌గేట్ల దగ్గర సాగుతున్న బంగారం అక్రమదందా బయటపడింది. గుంటూరు కేంద్రంగా సాగుతున్న అక్రమ బంగారం వ్యాపారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు నుంచి బంగారం పంపిస్తుంటే.. శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడి వ్యాపారులు డబ్బులు పంపిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మూడో కంటికి తెలియకుండా బస్సుల్లోనే వీటిని మార్చేస్తూ బిజినెస్ చేసేస్తున్నారు బంగారు వ్యాపారులు. ప్రైవేటు బస్సుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడడం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం బయటపడడం ఒక్కసారిగా కలకలం రేపింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బస్సుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఏ ఏ ప్రాంతాల్లో పద్మావతి ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయో ఆరా తీస్తున్నారు.

Read More : CM Jagan : వైఎస్సార్ తల్లీబిడ్డా వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. తూర్పు, పశ్చిమ గోదావరి ఎస్పీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రకు వెళ్లే బస్సుల్లో నిత్యం తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట ఇన్స్ పెక్టర్, కిర్లంపూడి ఎస్ఐ తనిఖీలు చేశారని పెద్దాపెరం డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. బస్సులో ఏదో వస్తుందని తమకు ముందుగానే సమాచారం వచ్చిందని అందులో 10 కోట్ల నగదు, 10 కేజీల 100 గ్రాముల బంగారం ఉందన్నారు. ఇన్ కంట్యాక్స్, జీఎస్టీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. గుంటూరు కేంద్రంగా బంగారం దందా కొనసాగుతోందని సమాచారం ఉందని, వెంటనే దర్యాప్తు జరుపుతున్నామన్నారు. మూడేండ్ల నుంచి ఇది కొనసాగుతోందని తెలుస్తోందని, దర్యాప్తులో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.