CM Jagan : వైఎస్సార్ తల్లీబిడ్డా వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

CM Jagan : వైఎస్సార్ తల్లీబిడ్డా వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

Ysr Tallibidda Vehicle

ysr tallibidda express vehicles : గర్భిణులు, బాలింతల కోసం ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తల్లీ బిడ్డల కోసం వాహనాలను నడపనుంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలను ఇందుకోసం సిద్ధం చేసింది. శుక్రవారం(ఏప్రిల్1,2022) విజయవాడ బెంజి సర్కిల్‌లో వైఎస్సార్ తల్లి బిడ్డా వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ప్రతి అక్కకు చెల్లెకి మంచి చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. అక్క, చెల్లెలు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకు జన్మ ఇచ్చే వరకు అన్ని సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రసవం అయిన మహిళలకు రెస్ట్ లో ఉన్నప్పుడు ఆర్ధిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Jagan Release Schemes Calendar : జూన్‌లో అమ్మఒడి, జూలైలో కాపు నేస్తం.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్‌

గతంలో అరకొర వసతులతో వాహనాలు ఉండేవన్నారు. గర్భిణీలు వెళ్లే వాహనాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. మెరుగైన సేవలు అందించి అధునాతన వాహనాలు ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. నాడు-నేడు కింద ఆసుపత్రిలో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. దేవుడి దయతో అందరికీ మంచి చేస్తున్నామని తెలిపారు.

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలను పంపనున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వాహనాలను ఎక్కువగా నడపనున్నారు. ఏజెన్సీ గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకుండా తల్లీబిడ్డ వాహనాలు వారికి అందుబాటులో ఉంచనున్నారు.

AmmaVodi : అమ్మఒడి… ప్రభుత్వం కీలక ఆదేశాలు

అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పటికే సిద్ధం చేసిన 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను విజయవాడ బెంజిసర్కిల్‌కు తరలించారు. సీఎం జగన్‌ వీటిని ప్రారంభించాక… ఆయా జిల్లాలకు పంపనున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రభుత్వం ఏడాదికి 24 కోట్ల రూపాయలు చెల్లించనుంది.