AmmaVodi : అమ్మఒడి… ప్రభుత్వం కీలక ఆదేశాలు
అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో హాజరు నమోదు చేయాలని

AmmaVodi : అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో హాజరు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్ లో రోజూ విద్యార్థుల హాజరు నమోదు చేయాలని చెప్పింది. అమ్మఒడి పథకానికి ఈ నెల 8 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. 75శాతం హాజరు కోసం టీచర్లు పిల్లలందర్నీ ఒకేరోజు స్కూలుకు రప్పిస్తున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో దీనిపై వ్యతిరేకత వస్తోంది.
నవంబరు 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు 130 రోజుల పని దినాలు ఉంటాయి. ఇందులో 98 రోజుల హాజరున్న విద్యార్థికే అమ్మఒడి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లుగా కరోనా ఉంది కాబట్టే ఈ నిబంధన అమలు చేయలేదని, ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేయనున్న సంగతి తెలిసిందే.
Heart Disease : చలికాలంలోనే గుండె జబ్బులు అధికం ఎందుకంటే?..
అమ్మఒడి పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమ్మఒడికి 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. గతంలోనూ హాజరు తప్పనిసరి ఉన్నప్పటికి ఉపాధ్యాయులు చూసీచూడనట్లుగా వ్యవహరించి అర్హులందరికీ లబ్ధి అందేలా చూశారు. ఈసారి ఆ అవకాశం లేకుండా బయోమెట్రిక్ హాజరును ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.
Pickle : నిల్వ పచ్చళ్ళతో ఆరోగ్యానికి ప్రమాదమా..?
2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం జూన్ నెలలో అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని… ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నారు. నాణ్యమైన ప్రమాణాలతో విద్య భోదిస్తున్న ఏపీ సర్కార్.. అందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇంత చేస్తున్నా.. విద్యార్థులను స్కూల్‌కి తీసుకురాకపోతే అనుకున్న మేర ఫలితాలు రావు. అందుకే ఏపీ సర్కార్ హాజరుతో అమ్మ ఒడిని ముడి పెట్టాలని నిర్ణయించింది.
- AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..
- Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..
- AP CM JAGAN: నేడు తిరుపతికి సీఎం జగన్ .. పలు అభివృద్ధి పనులు ప్రారంభం..
- China : భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్
1Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
2RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
3World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
4BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
5Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు
6Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
7MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్
8Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ
9Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
10Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా