Heart Disease : చలికాలంలోనే గుండె జబ్బులు అధికం ఎందుకంటే?..

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Heart Disease : చలికాలంలోనే గుండె జబ్బులు అధికం ఎందుకంటే?..

Heart

Heart Disease : కాలాలు మారుతున్న సమయంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగక అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

శీతాకాలంలో దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా మారుతుంది. చలి తీవ్రతను తట్టుకోలేక రక్తపోటు విషయంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇలా జరగడం వల్ల గుండె సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. అందుకోసమే శీతాకాలంలో గుండె సమస్యలతో బాధ పడకుండా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ శరీరాన్నంతా పరీక్షించుకోవాలి. శీతాకాలంలో పూర్తిగా మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నించాలి. ఈ కాలానికి అనుగుణంగా ఉండే దుస్తులను ధరించాలి.

మన శరీరంలో వేడిని పెంచే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆహారపదార్థాలను తినేటప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల మన శరీరం వేడిగా ఉండటంతోపాటు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. రోజూ వ్యాయామం చేయాలి. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ తినటం మానుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అధిక రక్తపోటు, బలహీనత.. వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. గుండె పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.