Covid Lockdown : అయినవాళ్లు రాలేక… కడసారి చూపుకు నోచుకోక…
గుండె సంబంధ సమస్యతో పాటు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసిన వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులు కడసారి చూసే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘటన పాడేరు ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

No Family Members For Covid Infected Person Died In Pune
Covid Lockdown Effect : గుండె సంబంధ సమస్యతో పాటు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసిన వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులు కడసారి చూసే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘటన పాడేరు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పుణే నగరానికి చెందిన బాజీరావ్ పాడేరు పట్టణ పరిధిలోని కాఫీ రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ సంస్థలో కొన్నాళ్లుగా నుంచి పనిచేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న అతడికి కరోనా లక్షణాలు కూడా ఉండటంతో వైద్యులు కొవిడ్ కేర్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పుణేలో ఉన్న కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అతడు బుధవారం ఉదయం ఊపిరందక మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉన్న సంస్థ సిబ్బందికి తెలియజేశారు.
మహారాష్ట్రలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు ఇక్కడకు వచ్చేందుకు వీల్లేకుండా పోయింది. అతడు పనిచేసే సంస్థ సిబ్బందీ సాయంత్రం వరకు రాకపోవడంతో మృతదేహం కరోనా బాధితుల మధ్యే ఆసుపత్రిలో ఉండిపోయింది. చివరకు ఇద్దరు సిబ్బంది ముందుకొచ్చి మృతదేహం తమకు అప్పగిస్తే శ్మశానంలో ఖననం చేస్తామని చెప్పడంతో అంబులెన్స్‌లో తరలించారు.