దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: నారా లోకేశ్

యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని నారా లోకేశ్ తెలిపారు.

Nara Lokesh

దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నిన్న న్యూయార్క్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా లోకేశ్ పలు విషయాలు తెలిపారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధంచేసేందుకు స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు నారా లోకేశ్ తెలిపారు. దీనిద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.

అలాగే, అమరావతిలో ఏర్పాటుచఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి నిపుణులు తయారవుతారని నారా లోకేశ్ అన్నారు. పెట్టుబడులకు ఏపీలో అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోలో పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశామని నారా లోకేశ్ చెప్పారు.

యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని నారా లోకేశ్ తెలిపారు. బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.

Vizianagaram: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మోగిన నగారా