Vizianagaram: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మోగిన నగారా
ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన ఈ ఏడాది జూన్‌లో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేసి, 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన ఈ ఏడాది జూన్‌లో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రఘురాజు భార్య సుధ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడం, టీడీపీ నేతతో కలిసి రఘురాజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణాలతో ఆయనపై వేటు వేశారు.
శాసనమండలిలో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో రఘురాజుకు మండలి ఛైర్మన్ ఆఫీసు నుంచి నోటీసు రాగా, ఆయన వివరణ కూడా పంపారు.
అనంతరం వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ రఘురాజుకు నోటీసు ఇచ్చారు. అందుకు రఘురాజు రాలేదు. చివరకు ఆయనపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. ఎన్నికల కోడ్‌తో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన రద్దయింది.
మహారాష్ట్ర ఎన్నికల వేళ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఏక్‌నాథ్ షిండే స్పందన