తన ప్రాణం పోయినా ఇల్లు విడిచి పెట్టనన్న వాణి.. ఆ ప్రాపర్టీ తనదన్న మాధురి

తమ ఆస్తి తీసుకుని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తున్నారని చెప్పారు.

శ్రీకాకుళం టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆయన భార్య వాణి‌, కుమార్తె హైందవి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా 10 టీవీతో వాణి మాట్లాడుతూ.. కొర్టులో కేసు ఉందని, ఇంట్లో ప్రవేశానికి కొర్టు తమకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఉండగా రిజిస్ట్రేషన్ చెల్లదని, ఇది కొర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలిపారు.

తమ ఆస్తి తీసుకుని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తున్నారని చెప్పారు. తన ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచి పెట్టనని, తనకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తిని అమ్మి కొన్న ఇల్లు ఇదని తెలిపారు. భగవంతుడు ఉన్నాడని, పిల్లలకు ఇల్లు చెందుతుందని భావిస్తున్నానని చెప్పారు. పోలీసుల నుంచి ప్రొటెక్షన్ అడుగుతున్నామని, పొలీసుల సహకారంతోనే ఇంట్లోకి వెళ్తానని అన్నారు. తనను భర్త మోసం చేస్తాడని, తన పిల్లలను చీట్ చేస్తాడని అనుకోలేదని చెప్పారు.

ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది: మాధురి
దివ్వల మాధురి మాట్లాడుతూ.. ఆ వివాదస్పద ప్రాపర్టీ తనదని, ఈ బిల్డింగ్ తన పేరు మీద ఉందని చెప్పారు. తన ఇంట్లోకి ఎవరూ రావడానికి వీలు లేదని అన్నారు, శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బయట తేల్చుకోవాలని అన్నారు. ఈ ఇంటిని తాను కోనుక్కున్నానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని చెప్పారు.

తాను ఒక్కదాన్నే ఉన్నానని, తనకు రక్షణ లేదని తెలిపారు. తాను గతంలో శ్రీనుకి రూ.2 కోట్ల అప్పు ఇచ్చానని చెప్పారు. శ్రీనుని తన డబ్బులు అడిగానని, డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేడు కాబట్టి బిల్డింగ్ రాసిచ్చారని తెలిపారు. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్మొచ్చని చెప్పారు.

Also Read: దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. ఆ ఇంటికి చేరుకున్న దివ్వల మాధురి

ట్రెండింగ్ వార్తలు