Maha Cements: మహా సిమెంట్స్ ములకలాపల్లి గ్రైండింగ్ యూనిట్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డులు
మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి ముగ్గురు ఉద్యోగులకు, మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ నుంచి మరో ముగ్గురు ఉద్యోగులకు గోల్డ్ కాయిన్లు బహుకరించారు చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.
Maha Cements: మహా సిమెంట్స్ ములకలాపల్లి గ్రైండింగ్ యూనిట్ ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డులు సొంతం చేసుకుంది. బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ఫైవ్ స్టార్ అవార్డ్, సోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్ మెంట్ అవార్డులను దక్కించుకుంది. ఈ పురస్కారాలను ప్రదర్శించి ఉద్యోగులతో ఆనందం పంచుకున్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రమేశ్వరరావు, ఎండీ రంజిత్. 20 ఏళ్ళు, పదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించారు. మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి ముగ్గురు ఉద్యోగులకు, మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ నుంచి మరో ముగ్గురు ఉద్యోగులకు గోల్డ్ కాయిన్లు బహుకరించారు చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.
మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (మహా సిమెంట్) ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని ములకలాపల్లి (కె. పురుషోత్తంపూర్) లో ఒక ప్రధాన సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. పారిశ్రామిక భద్రతపై గట్టి దృష్టి సారించి PPC, OPC సిమెంట్‌ను ఉత్పత్తి చేసే మై హోమ్ గ్రూప్ లో ఈ ప్లాంట్ ఒక భాగం.
Also Read: ఇంటర్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎప్పుడు.. ఫీజు ఎప్పుడు కట్టాలంటే?
