TS Inter Results 2026 : ఇంటర్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎప్పుడు.. ఫీజు ఎప్పుడు కట్టాలంటే?
TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు.
TS Inter Results 2026
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
- ఫలితాల్లో బాలికలదే పైచేయి
- ప్రథమ సంవత్సరంలో 66.20శాతం..
- ద్వితీయ సంవత్సరంలో 70.58శాతం మంది ఉత్తీర్ణత
TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే, ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 74.40శాతం మంది, బాలురు 57.69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70.58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 78.65 శాతం, బాలురు 62.50శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. మంచి పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని చెప్పారు.
విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా మాట్లాడుతూ.. పాసైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. సప్లమెంటరీ పరీక్షల్లో పాస్ అయినవారు డిగ్రీలో రెగ్యులర్ స్టూడెంట్‌గా వాళ్ళుకూడా ముందుకు వెళ్లవచ్చునని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈసారి సెకండియర్ విద్యార్థులు ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
బీసీ వెల్ఫేర్ కళాశాల పిల్లల పాస్ పర్సంటేజ్ బాగా పెరిగిందని యోగితా రానా చెప్పారు. బాలికలు ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారని, 76.55శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సంవత్సరం నుండి అందరికీ మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ ఏడాది నుండి బ్రేక్ ఫాస్ట్ సదుపాయం కూడా ఉంటుందని, అందులో రాగి జావా, పాలు వంటి సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశామని, అనేక మంచి సదుపాయాలు కల్పించామని, కళాశాలల్లో అందువల్లే పదివేల మందికిపైగా పిల్లలు గతేడాది ఎక్కువగా వచ్చారని యోగితా రానా పేర్కొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
♦ ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకోసం ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
♦ మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి.
♦ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
♦ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయి.
♦ వీటిని రెండు సెషన్లలో నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
