ఎంతసేపు ఎదురు చూడాలి:పెళ్లికి లేట్ గా వచ్చిన పెళ్లికొడుకు..ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు

పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లికొడుకు ఆలస్యంగా వచ్చాడని ఓ పెళ్లి కూతురు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం (డిసెంబర్ 7)న ఉత్తరప్రదేశ్ లోని బిజ్‌నోర్ జిల్లాలోని నంగల్‌జత్ గ్రామంలో ముహూర్తానికి రావాల్సిన పెళ్లికొడుకు నాకొద్దంటూ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
శుక్రవారం (డిసెంబర్ 6)మధ్యాహ్నం 2 గంటలకు పెట్టుకున్న పెళ్ళి ముహూర్తానికి పెళ్లికొడుకు గానీ వారి బంధువులు గానీ రాలేదు. దీంతో ఆడపెళ్లివారు ఆందోళన పడ్డారు. ఎదురు చూశారు అయినా రాలేదు. పెళ్లికి భారీ ఊరేగింపుతో రావాలని పెళ్లికొడుకు అనుకున్నాడు. ముహూర్తం మధ్యాహ్నం 2 గంటలకైతే సాయంత్రానికి పెళ్లివారు వచ్చారు. దీంతో విసిగిపోయిన పెళ్లి కూతురు..ఆమె తరపు బంధువులు కూడా పెళ్లి వద్దనుకున్నారు. ఇదే విషయాన్ని ఊరేగింపుతో సాయంత్రానికి వచ్చిన పెళ్లికొడుకుతోనూ..వారి బంధువులతోను చెప్పారు.
దీంతో పెళ్లికొడుకు..అతని బంధువులు వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పెళ్లికూతురికి తాము ఎన్నో విలువైన వస్తువులు పెట్టామనీ..పెళ్లికి ఆలస్యంగా వచ్చామని పెళ్లి కూతురు బంధువులు తమను ఓ గదిలో పెట్టి కొట్టారనీ..ఇప్పుడు పెళ్లి రోజున పెళ్లి వద్దంటే ఎలా అంటూ ఫిర్యాదు చేశారు. పెళ్లికూతుర్ని..ఆమె బంధువుల్ని పోలీసులు పిలిచ్చి మాట్లాడారు. దానికి వారు సమాధానం చెబుతూ..పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిందే కాకుండా..అధికంగా డబ్బును..ఓ సైకిల్ ను డిమాండ్ చేశారని ఇటువంటివారిని నమ్ముకుని పెళ్లి ఎలా చేస్తామని ఎదురు ప్రశ్న వేశారు.
ఇలా వాదోపవాదాలు తరువాత ఇష్టం లేని పెళ్లి జరిగితే ఇరువురికీ మంచిదికాదని పోలీసులు నచ్చచెప్పారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. దీంతో సదరు పెళ్లి కూతురికి శనివారం (డిసెంబర్ 7)న మరో వ్యక్తిని గ్రామస్తులు..బంధువుల సమక్షంలో అందరి అంగీకారంతో వివాహం చేసుకుంది.