Amaravati Municipal Corporation : అమరావతి కార్పొరేషన్ వద్దు.. మందడం గ్రామ సభ తీర్మానం

అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..

Amaravati Municipal Corporation : అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. సీఆర్డీఏను అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజల డిమాండ్ చేశారు. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజధానికి భూములు తీసుకునేటప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని స్మార్ట్‌ సిటీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానిని నిర్వీర్యం చేయడానికే కార్పొరేషన్ ఏర్పాటని గ్రామస్తులు ఆరోపించారు.

Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఆగిపోయిన అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండంలలోని 3 గ్రామాలు కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు కార్యాచరణ పున: ప్రారంభించింది. మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్‌లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు. గతంలో ఇదే ప్రతిపాదనతో గ్రామసభలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించగా రాజధాని రైతులు అడ్డుకున్నారు.

Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల

కాగా, అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌ను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ఏర్పాటు కుట్రపూరితమైనదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామసభల్లో తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వం తమ అభిష్టానికి వ్యతిరేకంగా ముందుకెళితే హైకోర్టును ఆశ్రయిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.

రూ.2 లక్షల కోట్ల పైబడి విలువైన అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని, 480 ఎకరాల తాకట్టుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిందని టీడీపీ నేతలు చెప్పారు. రైతులు త్యాగం చేసిన 34 వేల ఎకరాల భూమి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రూ.2లక్షల కోట్ల పైబడి ఉంటుందన్నారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు