Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల

రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు త‌గ్గుతాయి.

Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల

Ranapala

Ranapala : అందంకోసం పెచుకునే రణపాల మొక్క ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం కలిగివుంది. రణపాల మొక్కలను కుండీల్లో పెంచుకుని పలు రకాల వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్,అనాఫీలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది యాంటీ బయోటిక్ లా పని చేస్తుంది. వ‌గ‌రు, పులుపుగా అనిపించే ఈ మొక్క ఆకులు చూడటానికి మందంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించటంలో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు కరిగించటానికి రణపాల ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తిన్నా, లేకుంటే 30 ఎంఎల్ మోతాదులో ఆకులను కషాయాన్ని తాగినా కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. జీర్ణాశయ సమస్యలను నివారించటంలో దోహదపడుతుంది. అల్సర్లు, పుండ్లు , మలబద్దకం వంటి సమస్యలను పోగొడుతుంది. అధిక రక్తపోటు, తలనొప్పి, గడ్డలు, వాపు వంటి ఎన్నో రకాల రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క ఆకుల నుండి తయారైన టీ ని తిమ్మిరి, ఉబ్బసంతో పాటు సైనస్ సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపటంలో ఉపకరిస్తుంది. దెబ్బలు తగిలిన గాయాలకు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి. దీని వల్ల గాయం త్వరగా మానిపోతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంచేందుకు సహాపడుతుంది. ఈ ఆకులను ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి చొప్పున తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అంతే కాకుండా రోజుకు 5చక్కుల ఆకుల రసంతో రక్త పోటును నియంత్రించవచ్చు.

రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు త‌గ్గుతాయి.  స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనె ను 60 మిల్లీ లీటర్ల కషాయం లో కలిపి ఇవ్వాలి. రణపాల ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల పైల్స్ బాధపోతుంది.

రణపాల ఆకులను కడిగి రసం తీసి మజ్జిగ లో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తాగితే విరేచనాలు తగ్గి పోతాయి. మల ద్వారం లో జరిగే రక్త స్రావాన్ని కూడా ఆపుతుంది. స్త్రీలలో జరిగే రక్త స్రావాన్ని కూడా ఆపుతుంది. మూత్రంలో వచ్చే మంట ను అరికడుతుంది. రణపాల ఆకులను ముద్దగా దంచి కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి ఆనెల పై ప్రతి రోజు రాసుకుంటే తగ్గి పోతాయి. ఇది చర్మ వ్యాధులకు కూడా మందు. కుళ్ళిన పుండ్లను కూడా ఈ నూనె తగ్గిస్తుంది. విషపు కీటకాలు కుడితే ఈ రణపాల ఆకు రసం పైన పూసుకుంటే తగ్గి పోతుంది.