Maoist Hidma
Maoist Hidma: భద్రతాబలగాల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా హతమైన విషయం తెలిసిందే. హిడ్మాతోపాటు అతని భార్య మడకం రాజేతోపాటు మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. అయితే, ప్రస్తుతం హిండ్మా ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో కీలక విషయాలను హిడ్మా ప్రస్తావించాడు.
భద్రతాబలగాల చేతిలో హతమైన హిడ్మా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో హిడ్మా పోలీసులకు లొంగిపోయేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్ లో ఉన్న ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖరాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు.
Also Read: Encounter : మావోయిస్టులకు మరో బిగ్‌షాక్.. ఏవోబీలో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
నవంబర్ 10వ తేదీన జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాశాడు. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతామని హిడ్మా పేర్కొన్నాడు. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలి. త్వరలో ఏపీలో తనను కలవాలని సదరు జర్నలిస్టును హిడ్మా కోరాడు. ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆ లేఖలో హిడ్మా ప్రస్తావించాడు. అయితే, పోలీసులకు లొంగిపోయేందుకు నిర్ణయించుకున్న క్రమంలోనే ఆయన ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతాబలగాలు తారసపడడం.. ఎదురు కాల్పులు జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.