Encounter : మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్.. నిన్న హిడ్మా.. నేడు దేవ్ జీ, ఆజాద్ సహా అగ్రనేతలు హతం..

Encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా కోలుకోలేని దెబ్బలు తగుతులున్నాయి. బుధవారం ఉదయం ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది.

Encounter : మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్.. నిన్న హిడ్మా.. నేడు దేవ్ జీ, ఆజాద్ సహా అగ్రనేతలు హతం..

encounter

Updated On : November 19, 2025 / 11:40 AM IST

Encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా కోలుకోలేని దెబ్బలు తగుతులున్నాయి. మంగళవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. హిడ్మాతోపాటు అతని భార్య మడకం రాజేతోపాటు మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఇదే సమయంలో ఏపీలోని ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాజాగా.. ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.

బుధవారం ఉదయం ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. మారేడుమిల్లి మండలం జీఎంవలస సమీపంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు.

మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే తాజా ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాల కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, ఆజాద్, జోకారావులతోపాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిసింది.

మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా తిరుపతి అలియాస్ దేవ్ జీ కొనసాగుతున్నారు. 1983 చివరిలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కార్యదర్శిగా తిరుపతి కొనసాగుతున్నాడు. మిలిషియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తిరుపతి సమీపంలోని అలిపిరిలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవ రావుతోపాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన తలపై ఎన్ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర, ఒడిస్సా ఇంఛార్జ్‌ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందాడు. వెపన్స్‌ డీలింగ్‌లో శంకర్‌ది కీలక పాత్ర. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు హతం అవుతుండటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు.

విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మిగిలిన వారు లొంగిపోవడం మంచిదని ఆయన మావోయిస్టులకు హితవుపలికారు. అయితే, మంగళవారం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తరువాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.

ఆయుధాలు వీడి లొంగిపోండి : మల్లోజుల
ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారింది. పరిస్థితులను అర్థం చేసుకుని తాము ఆయుధాలను వీడామని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని చెప్పారు.