Heavy Rain Alert: మారుతున్న వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారి, రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా(Heavy Rain Alert) రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- August 22, 2026 / 07:28 PM IST
Meteorological Department forecasts heavy rain in ap and Telangana next 3 days
- బంగాళాఖాతంలో కొత్త అల్పపీడన ప్రాంతం
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- గంటకు యాభై కిలోమీటర్ల గాలులు
Heavy Rain Alert: ఉత్తర బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారి, రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవన ద్రోణి మరింత బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక:
ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Heavy Rain Alert) పడనున్నాయి. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వానలు:
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
