Talliki Vandanam: ‘తల్లికి వందనం’ పథకంపై బిగ్ అప్డేట్.. దరఖాస్తుకు మరో ఛాన్స్.. ఖాతాల్లో డబ్బులు పడేది అప్పడే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువులకు మద్దతుగా ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం(Talliki Vandanam)’ పథకం అమలులో వేగం పెంచింది.
Ap talliki vandanam scheme august 30 fund release 13000 rupees details
- ఆగస్టు 30న నిధుల విడుదల
- అర్హులకు రూ.13,000 సాయం
- ఆగస్టు 25తో దరఖాస్తు ముగింపు
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువులకు మద్దతుగా ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం(Talliki Vandanam)’ పథకం అమలులో వేగం పెంచింది. మొదటి తరగతి, ఇంటర్ ఫస్టియర్లో కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు గతంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందని లబ్ధిదారులకు ఆగస్టు 30వ తేదీన నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున జమ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Ap Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
సుమారు 2.78 లక్షల మందికి లబ్ధి.. సచివాలయాల్లో సరిచూసుకోండి:
కొత్తగా చేరిన విద్యార్థులు, సాంకేతిక సమస్యలతో నిధులు ఆగిపోయిన వారు కలిపి సుమారు 2.78 లక్షల మంది ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. అర్హత ఉండి కూడా పథకం వర్తించని వారు తమ సమస్యలను వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పథకం లబ్ధి చేకూరాలంటే ఇ-కేవైసీ (e-KYC), బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి.
ఆగస్టు 25 చివరి తేదీ.. తక్షణమే దరఖాస్తు చేయండి:
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు లేదా వివరాలు అప్డేట్ చేసుకోని వారు ఆగస్టు 25వ తేదీ లోగా సమీప గ్రామం లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. బ్యాంక్ వివరాలు, ఆధార్ అనుసంధానం సరిచేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది.
