Ambati Rambabu : నిజం ఇంకా గెలవలేదు, బెయిల్‌కే ఇంత హంగామానా? : మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ..మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

Ambati Rambabu

Ambati Rambabu Comments on Chandrababu Interim Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయం గెలిచింది అంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అంశాలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రాబాబుకు ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చారు..దీనిపై చాలా హాంగామా చేస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. నిజం గెలిచింది అంటున్నారు కానీ ఇంకా నిజం గెలవలేదు..కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ మాత్రందానికే ఇంత హంగామానా..? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని..గతంలో ఏసి ప్రొవైడ్ చేయమని రిలీఫ్ ఇచ్చారని అన్నారు.మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు.కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదు..రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

తెలంగాణలో టిడిపి జెండా పీకేశారు..అంటూ తెలంగాణలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేయటాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని..జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది కాబట్టి రాజీనామా చేశారు అన్నారు.ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికం అంటూ విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో ముందో తర్వాతో ఏపీలోనూ జెండా పీకేస్తారని అన్నారు.