పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : మంత్రి సత్యప్రసాద్

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.

Minister Anagani Satya Prasad

Minister Anagani Satya Prasad : వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పెద్దెత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారు. తప్పుచేసి తప్పించుకోవడం సాధ్యం కాదని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసు విచారణ వేగంగా జరుగుతోందని చెప్పారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్ళలో భూములకు సంబంధించిన వందల ఫైళ్ళు దొరికాయి. మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని, వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. ప్రజా ధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని, ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని చెప్పారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడంవల్ల గతంలో విద్యుత్ చార్జీల ధరలు పెరిగాయి. 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Also Read : తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో భక్తులు

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వ్యక్తిగతం. మేమెక్కడా శ్రీనివాస్ ను విమర్శించడం లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్యనేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదు. వైసీపీ నేతలు మాపై బురదజల్లాలని చూస్తున్నారు. కేంద్రంలో మమ్మల్ని దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు