రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష

రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

Duvvada Srinivas Family Controversy

Updated On : August 12, 2024 / 2:01 PM IST

Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష నాల్గోరోజూ కొనసాగుతుంది. ఇంటి ఆరుబయటే వాణి, హైందవి పడుకున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా వారు చెబుతున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆదివారం పలాస జాతీయ రహదారిపై కారు ప్రమాదంతో మాధురి ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. అయితే, స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. మాధురికి మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తలరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.

Also Read : సిద్ధనాథ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో భక్తులు మృతి

దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం పలాస జాతీయ రహదారిపై మాధురి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేను ఆత్మహత్య చేసుకోవాలనే కారును యాక్సిడెంట్ చేశానని చెప్పింది. తన పై ట్రోలింగ్ చేస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్య యత్నం చేశానని తెలిపింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, కానీ, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో ఆమె కారు నుజ్జునుజ్జు అయింది. నిర్లక్ష డ్రైవింగ్ తోపాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం.. నూతన జాతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం పోలీసులు దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు.