సిద్ధనాథ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో భక్తులు మృతి

బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

సిద్ధనాథ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో భక్తులు మృతి

Bihar

Updated On : August 12, 2024 / 8:06 AM IST

Siddheshwar Nath Temple : బీహార్ రాష్ట్రంలోని జెహానాబాద్ జిల్లా ముగ్ధంపూర్ లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా మంది స్థానిక ముగ్దంపూర్ ఆసుపత్రి, జెహనాబాద్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

Also Read: Paris Olympics 2024 : ముగిసిన పారిస్ ఒలింపిక్స్ .. అమెరికాదే అగ్రస్థానం.. అదిరిపోయిన ముగింపు సంబరాలు

తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పవిత్ర సావన్ మాసంలో మూడో సోమవారం కావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి నుంచి భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయంలో శివుడికి జలాభిషేకం చేయడానికి నీటితో వెళ్తున్న క్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. క్యూలో నిల్చున్న భక్తులు తోసుకోవడంతో రైలింగ్ విరిగిపోయి ఈ ప్రమాదం జరిగింది.

Also Read : ఇది ప్రమాదం కాదు.. చనిపోదామనే హైవే పైకి వచ్చా: మాధురి

జెహనాబాద్‌ ఎస్‌డిఓ వికాస్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇదొక విషాదకర ఘటన. ఏర్పాట్లన్నీ సక్రమంగా చేశాం. ఎలాంటి తోపులాట జరగకుండా పటిష్ఠ భద్రతనుసైతం ఏర్పాటు చేశాం. కానీ, ఊహించని ఘటన జరిగింది. సంఘటనా స్థలాన్ని డీఎం, ఎస్పీ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. తొమ్మిది మందికి గాయాలు కాగా వారికి చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతిచెందగా వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు.  ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై 2న యూపీలోని హత్రాస్ లో తొక్కిసలాట చోటు చేసుకొని 120 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.