తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో భక్తులు
ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tirumala Cheetah : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచరిస్తోంది. 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. గతంలోనూ తిరుమలలో చిరుతల సంచారం కలకలానికి దారితీసింది. పలువురిపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇవాళ(ఆగస్టు 11) రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లో 55, 56 మలుపుల మధ్య చిరుత పులి వాహనదారులకు కనిపించింది. వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మోకాలి మెట్టు వద్ద ఉన్న ఫారెస్ట్ సిబ్బందికి, విజిలెన్స్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వాహనదారులను, నడకదారిలో వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. గత కొన్ని నెలలుగా తిరుమల ఘాట్ రోడ్ కావచ్చు, నడకదారిలో కావచ్చు.. చిరుతల జాడ కనుమరుగైపోయిందని చెప్పొచ్చు.
తాజాగా మళ్లీ ఇప్పుడు చిరుత సంచారం కనిపించింది. దీంతో ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రధానంగా 7వ మైలు వద్ద నుండి కూడా నరసింహ స్వామి ఆలయం వద్ద వరకు వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. గుంపులు గుంపులుగా వెళ్లాలని భక్తులకు సూచించారు. ఇక మోకాలి మెట్టుకు సమీపంలోనే 56వ మలుపు ఉండటంతో అక్కడ ఉండే భక్తులను కూడా అప్రమత్తం చేశారు. తిరుపతికి వెళ్లేందుకు టోల్ గేట్ దగ్గర స్టార్ట్ అవుతారో అక్కడే వాహనదారులను హెచ్చరించారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత చిరుత పులి కనిపించడంతో భక్తులు, స్థానికులు, టీటీడీ అధికారుల్లో అలజడి మొదలైంది.
తిరుమల నుంచి తిరుపతి వెళ్లడానికి 58వ మలుపు వద్ద నుంచి మలుపులు మొదలవుతాయి. నడకదారికి, మోకాలి మెట్టుకు అత్యంత సమీపంలోనే 56, 55 మలుపులు ఉంటాయి. దాదాపు 150 మీటర్ల దూరంలో కాలిబాట ఉంటుంది. దాంతో భక్తులను అప్రమత్తం చేశారు అధికారులు. తిరుమల నుంచి వచ్చే వాహనదారులను కూడా అప్రమత్తం చేసి ముందుకు పంపుతున్నారు.
Also Read : తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం ఆందోళనకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు