Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చగాళ్లు అని అన్నారు. వాలంటీర్లను మనమే పెట్టామని, నచ్చకపోతే తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dadishetty Raja : ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా.. వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పరిపాలన సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థని మంత్రి రాజా టార్గెట్ చేశారు. వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చగాళ్లు అని అన్నారు. వాళ్లు మనపై పెత్తనం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారని దాడిశెట్టి రాజా అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వాలంటీర్లను మనమే పెట్టామని, నచ్చకపోతే తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రాజా. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేది ఎవరు అన్న మంత్రి రాజా.. వైసీపీ కార్యకర్తలు సెక్రటేరియట్లను కంట్రోల్ కి తీసుకుని నడిపించాలన్నారు మంత్రి రాజా. ఈ పార్టీ కార్యకర్తలదని మంత్రి తేల్చి చెప్పారు.

వాలంటీర్లను ఉద్దేశించి మంత్రి రాజా చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. కాగా, కొన్ని రోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు సైతం వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా అభివర్ణించిన ఆయన.. వాలంటీర్లు పార్టీకి సమాచారం చేరవేసే సైనికులన్నారు. అంతేకాదు.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనే తీసేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని స్పష్టం చేశారు.

Ap High Court: వాలంటీర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

వాలంటీర్లను ఉద్దేశించి మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన కలకలం సద్దుమణగక ముందే.. వాలంటీర్లు బచ్చాగాళ్లు అంటూ మరో మంత్రి నోరుపారేసుకోవడం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా.. సీఎం జగన్ ఆలోచనన నుంచి పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను ఉద్యోగుల్లా కాకుండా సేవా భావానికి నియమించినట్టు సీఎం పదే పదే చెబుతూ ఉంటారు. వాలంటీర్స్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారుల ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు సులభంగానే ప్రభుత్వ సేవలు పొందడం వీలవుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజాలు పొందొచ్చు. తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. పథకం అమలు వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం.

Volunteers : గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ మరో శుభవార్త

ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైపు దేశం మొత్తం చూడటం గర్వంగా ఉందని పలు సందర్భాల్లో జగన్ అభిప్రాయపడ్డారు. వివక్ష, లంచం, అవినీతికి తావు లేకుండా, కుల మత రాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని జగన్‌ అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి సీఎం జగన్ అంత గొప్పగా చెప్పుకుంటుంటే.. మంత్రులేమో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీ శ్రేణుల్లో దుమారం రేపుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు