Ap High Court: వాలంటీర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

రాజకీయ కక్షతో ప్రభుత్వ పథకాలు అమలుచేయని వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించింది.

Ap High Court: వాలంటీర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Ap High Court

Ap High Court: రాజకీయ కక్షతో ప్రభుత్వ పథకాలు అమలుచేయని వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించింది. గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం, గారపాడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, తమకు వైఎస్ఆర్ చేయూత పథకం అమలు కావడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, వాలంటీర్లు పథకాల్ని రాజకీయ కక్షతో నిలిపివేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రామస్థుల తరఫున న్యాయవాది అరుణ్ శౌరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. ప్రభుత్వ పథకాలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన ఏడుగురు వాలంటీర్లకు నోటీసులు జారీ చేశారు.

AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

ఈ సందర్భంగా వాలంటీర్లకు ఉన్న సర్వీసు నిబంధనలేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘వాలంటీర్ అంటే స్వచ్ఛందం కాదా? డబ్బులు ఎలా ఇస్తారు? వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? వాలంటీర్లు లబ్ధిదారుడిని ఎంపిక చేయడమేంటి? ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. పెన్షన్ దారుల సొమ్ముతో వాలంటీర్ పారిపోయాడని శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన పలు వార్తలను కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. కాగా, పిటిషన్ దాఖలు చేసిన వాళ్లకు ప్రభుత్వ పథకం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.