Kodali Nani: రైతు పండించే ప్రతి గింజను కొంటాం!

పంట వేసుకోవడం రైతు ఇష్టమని, మనం కేవలం సలహాలు మాత్రమే ఇస్తామని అన్నారు మంత్రి కొడాలి నాని.

Kodali Nani: రైతు పండించే ప్రతి గింజను కొంటాం!

Kodali Nani

Updated On : December 20, 2021 / 6:32 PM IST

Kodali Nani: పంట వేసుకోవడం రైతు ఇష్టమని, మనం కేవలం సలహాలు మాత్రమే ఇస్తామని అన్నారు మంత్రి కొడాలి నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన కొడాలి నాని.. ఎంత వరి ధాన్యం వచ్చినా ప్రతి గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగొళ్ల విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా RBKల ద్వారా చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు.

తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, కేవలం 21 రోజుల్లో వారికి పేమెంట్ ఇవ్వాలని అన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో బహిరంగంగా కొనుగోలు చేయలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ మనకు ఇబ్బందులు ఉన్నా కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

వర్షాలకు రంగు మారిన ధాన్యం రేటు తగ్గించకుండా కొంటామని చెప్పారు. 21 రోజుల్లో డబ్బులు అందిస్తామన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. పక్క రాష్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చెయ్యమని చెబుతున్నాయని కూడా అన్నారు మంత్రి.