ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు, స్థానిక ఎన్నికల నిర్వహణపై మంత్రి కీలక వ్యాఖ్యలు

  • Publish Date - October 23, 2020 / 02:49 PM IST

mekapati goutham reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి కరోనావైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయన్నారు. దసరా తర్వాత సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. నవంబర్, డిసెంబర్ లో పరిస్థితులను చూసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం ఉంటుందన్నారు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల గుర్తించి మంత్రి ప్రస్తావించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వేరు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేరు అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిగి తీరాల్సిందే అన్న మంత్రి గౌతమ్ రెడ్డి వాటితో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదన్నారు.

ట్రెండింగ్ వార్తలు