వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై మంత్రి పయ్యావుల కీలక వ్యాక్యలు..

అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న శాసనసభ సమావేశాలలో ..

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav : ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ నిర్వహణపై మంత్రి సంతకాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

Also Read : కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వాళ్లను వదిలిపెట్టనని వార్నింగ్..

అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ లో పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. శాసన సభ ఏర్పాట్లకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకాలు చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Also Read : డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసంతకం ఏ ఫైలుపై చేశారో తెలుసా?

ప్రజల కోసం.. ప్రజల సంక్షేమంకోసం సభ.. అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామని పయ్యావుల కేశవ్ చెప్పారు. జగన్ సభకు హాజరు విషయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జగన్ సభకు రావాలి.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని కేశవ్ చెప్పారు. స్వపక్షమైనా, విపక్షమైనా మేమే.. ప్రజలకోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్ధంగా ఉంటామని పయ్యావుల స్పష్టం చేశారు.