డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసంతకం ఏ ఫైలుపై చేశారో తెలుసా?

పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసంతకం ఏ ఫైలుపై చేశారో తెలుసా?

Pawan Kalyan

Pawan Kalyan Take Charge as Deputy CM : జనసేన అధినేత, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత ఛాంబర్ లో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పవన్ కల్యాణ్ కు ఆశీర్వచనాలు అందించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ చూశారా? ‘శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్’ అంటూ..

పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి రెండవ సంతకం చేశారు.