కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వాళ్లను వదిలిపెట్టనని వార్నింగ్..

తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మావారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వాళ్లను వదిలిపెట్టనని వార్నింగ్..

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగిందని, నా కుటుంబాన్ని దొంగ వాళ్లుగా చిత్రీకరించి జైళ్లకు పంపారని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1 ఏప్రిల్ 2017 తర్వాత బీఎస్-4 వాహనాలు అమ్మకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇది అనేక రాష్ర్టాల్లో హైకోర్టులు తీర్పునిచ్చాయి. తప్పుచేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు.. నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

నేను అడిగితే కేసు నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు చేస్తారు. కానీ, నేను ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తాను. దీనికి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కమిషనర్ సీతా రామాంజనేయులు, అప్పటి మంత్రి పేర్నినాని కారణం. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలి. విచారణ జరపాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తానని, ఏపీని చెడకొట్టింది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ చూశారా? ‘శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్’ అంటూ..

తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మావారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులే. నా బస్సులన్నింటిని ట్రాన్స్ పోర్ట్ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలి. నా పరువు తీసి బయటి తిరగకుండా చేశారు. నన్ను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి తిండి కూడా పెట్టలేదు. వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తారు..? నేను ఎలాంటి తప్పు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.