జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు.. నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు.. నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi

PM Narendra Modi In Nalanda University : బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అంతకుముందు నలంద యూనివర్శిటీ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నలంద శిథిలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలంద విధ్వంసాన్ని గుర్తు చేసుకున్నారు. జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని అన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలవ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు. కానీ, అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు అనే సత్యాన్ని ప్రకటించేదే నలంద అంటూ మోదీ పేర్కొన్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి 10 రోజుల్లోనే నలందను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టం మాత్రమే కాదు.. ఇది భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి శుభ సంకేతంగా కూడా నేను భావిస్తున్నానని మోదీ తెలిపారు.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ చూశారా? ‘శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్’ అంటూ..

నలంద పునరుజ్జీవనం దాని పురాతన అవశేషాలకు సమీపంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నూతన క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పనుంది. ఏయే దేశాలు బలమైన మానవీయ విలువలు కలిగి ఉన్నాయో నలంద చెబుతుంది. జాతీయ చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో నలందకు తెలుసు. నలంద కేవలం భారతదేశ గత పునరుజ్జీవనం మాత్రమే కాదు.. ప్రపంచం, ఆసియాలోని అనేక దేశాల వారసత్వం నలందతో ముడిపడి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అన్ని స్నేహపూర్వక దేశాలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Also Read : ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి.. రేపు ప్రమాణస్వీకారం

నలంద కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 17దేశాలకు చెందిన మిషన్ల అధిపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నలంద క్యాంపస్‌లో 1900 సీటింగ్ సామర్థ్యంతో 40 తరగతి గదులు, రెండు అకడమిక్ బ్లాక్‌లు, 300 సీట్ల సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఏర్పాటు చేశారు. సుమారు 550 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి సదుపాయం ఉంది. 2000 మంది వ్యక్తులకు వసతి కల్పించే యాంఫీథియేటర్, ఫ్యాకల్టీ క్లబ్ ల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక ఇతర సౌకర్యాలను కూడా నలంద విశ్వవిద్యాలయంలో కల్పించారు. సోలార్ ప్లాంట్లు, తాగునీటి శుద్ధి కర్మాగారాలు, మురుగునీటిని పునర్వినియోగం చేసే నీటి రీసైక్లింగ్ ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులు అనేక ఇతర పర్యావరణ అనుకూల సౌకర్యాలతో క్యాంపస్ ను నిర్మించారు.

Also Read : డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్.. పవన్ వెంట ఎవరెవరు ఉన్నారంటే..

నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్ భారత్, తూర్పు ఆసియా సమ్మిట్ (EAS) దేశాల మధ్య సహకారంగా రూపొందించబడింది. దాదాపు 1600 సంవత్సరాల క్రితం స్థాపించబడిన నలంద విశ్వవిద్యాలయం.. ప్రపంచంలోని మొదటి నివాస విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.