ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి.. రేపు ప్రమాణస్వీకారం

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి.. రేపు ప్రమాణస్వీకారం

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary : టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుచ్చయ్య చౌదరికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకరుగా వ్యవహరించాలని కోరారు. బుచ్చయ్య చౌదరి అందుకు అంగీకరించారు. దీంతో గురువారం బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read : ఏపీలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. వారికి మాత్ర‌మే..!

బుచ్చయ్య చౌదరి టీడీపీ సీనియర్ నేత. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం చంద్రబాబు అత్యంత సీనియర్ శాసనసభ్యుడిగా సభలో ఉన్నారు. తొమ్మిది సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత సీనియర్ ఎమ్మెల్యేలుగా బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, పెద్దిరెడ్డి లాంటివారు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు కూడా ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలిచారు. అయితే, అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్ గా చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయన గురువారం గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.